HYD Rain | నిమిషాల్లోనే…

భాగ్య‌నగరంలో ఒక్కసారిగా భారీ వర్షం మొద‌లైంది. నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎల్‌బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మణికొండ, చిత్రపురి, బోడుప్పల్, నాంపల్లి, గచ్చిబౌలి వంటి ప్రాంతాలు జలమయం అయ్యాయి.

కేవలం నిమిషాల వ్యవధిలోనే రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో భారీ ట్రాఫిక్ జామ్‌ల వల్ల ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి.

ఇక‌ హైదరాబాద్‌లో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. నాగర్‌కర్నూల్, గద్వాల, మహబూబ్‌నగర్, వనపర్తి, మెదక్, నల్లగొండ, వికారాబాద్ ప్రాంతాల్లో కూడా వర్షం దంచికొట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే మూడు రోజులలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Leave a Reply