ముస్లిం సంక్షేమానికి.. నిరంతరంగా కృషి

ముస్లిం సంక్షేమానికి.. నిరంతరంగా కృషి

రంజాన్ తోపా కిట్ట్ ల పంపిణీ

హసన్ పర్తి, ఆంధ్రప్రభ : ముస్లింల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని హసన్ పర్తి, 66వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కనపర్తి కిరణ్ అన్నారు.హన్మకొండ జిల్లా హాసన్ పర్తి మండల కేంద్రంలో శుక్రవారం వర్ధన్నపేట శాసనసభ్యులు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆదేశాల మేరకు ఈద్ ముబారక్ తోఫా కిట్ట్ లను ముస్లిం కుటుంబాలకు కిరణ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కిట్ట్ లను పంపిణీ చేయడం శుభపరిణామమని అన్నారు.

గత ప్రభుత్వాలు మైనార్టీ సంక్షేమాన్ని పూర్తిగా విస్మసించారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మైనార్టీల పక్షపాతి అని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిన 4 శాతం రిజర్వేషన్ తోఎంతోమంది ముస్లిం విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగ రంగాలలో రాణిస్తున్నారని గుర్తు చేశారు.రంజాన్ మాసం పవిత్రత త్యాగం సహనం, సేవా భావానికి ప్రతీకగా పేర్కొన్నారు.ఉపవాస దీక్ష ద్వారా మనిషిలో నియంత్రణ, పరస్పర గౌరవం సోదరభావం పెరుగుతాయని తెలిపారు.

సమాజంలో అన్ని మతాల వారు పరస్పర గౌరవంతో ఐక్యతతో జీవించాలనే సందేశాన్ని రంజాన్ పండుగ అందిస్తుందని పేర్కొన్నారు దేశంలో మత సామరస్యాన్ని కాపాడుతూ అందరూ కలిసి ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు,జన్ను రవీందర్,ఆరెల్లి వెంకటస్వామి,పుల్ల రవీందర్,పెద్దమ్మ నరసింహ రాములు, మేకల ఆనంద్. గొర్రె కిరణ్ కుమార్ పోతరాజు ప్రభాకర్, తాళ్ల మధు, గరిగే రాజు.బిగుళ్ల సురేష్.ఆసిఫ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మైనారిటీ ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply