21వ వార్డులో తోపాజీ వీణ హ‌రీశ్ ఘ‌న‌విజ‌యం

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి మున్సిపాలిటీ 21వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిల‌ర్‌గా తోపాజీ వీణ హరీశ్‌గుప్తా విజ‌య‌కేత‌నం ఎగుర‌వేశారు. శుక్ర‌వారం జ‌రిగిన మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థుల హ‌వా కొన‌సాగ‌డ‌మే కాకుండా భారీ ఆధిక్యాన్ని సైతం ప్ర‌ద‌ర్శించారు. తోపాజీ వీణ హ‌రీశ్ మాట్లాడుతూ.. ఈ విజ‌యాన్ని త‌మ‌కు క‌ట్ట‌బెట్టినందుకు ఎంతో సంతోషంగా ఉంద‌ని అన్నారు. ఓట‌ర్ల‌కు పేరుపేరునా కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నాన‌ని చెప్పారు. 21 వార్డు ప్ర‌జ‌ల‌కు ఎల్ల‌ప్పుడూ రుణ‌ప‌డి ఉంటామ‌ని ఆమె పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా టీపీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి తోపాజీ అనంత‌కిష‌న్ గెలుపులో కీల‌క పాత్ర వ‌హించి విజ‌య‌తీరాల‌కు చేర్చార‌ని పార్టీ శ్రేణులు పేర్కొన్నారు. ఈ విజ‌యం గ‌ర్హ‌కార‌ణంగా ఉంద‌ని, ఎంతో బాధ్య‌త‌ను పెంచింద‌ని వివ‌రించారు. ఊహించిన‌ట్టే సంగారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగుబోతోంద‌ని ఆమె వెల్ల‌డించారు.

Leave a Reply