Toll Plaza | కారుపై సిమెంట్ ట్యాంక‌ర్ బోల్తా

Toll Plaza | కారుపై సిమెంట్ ట్యాంక‌ర్ బోల్తా

Toll Plaza | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి కారుపై బోల్తా పడడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ బ్రేకులు విఫలమవడంతో అదుపుతప్పి కారుపై బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది. అందులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. అయితే కారులో ఎంతమంది ఉన్నారనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

ప్రమాదం వెంటనే టోల్ ప్లాజా సిబ్బంది, స్థానికులు అప్రమత్తమై రక్షణ చర్యలు చేపట్టారు. కారులో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

Leave a Reply