Together | పార్టీని బలోపేతం చేస్తా..

Together | పార్టీని బలోపేతం చేస్తా..

  • నమ్మకాన్ని వమ్ము చేయను
  • పీసీసీ అధ్యక్షుడికి కృతజ్ఞతలు
  • కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఇన్‌చార్జి వెలిచాల

Together | కరీంనగర్, ఆంధ్రప్రభ : కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని నూతన ఇన్‌చార్జ్ వెలిచాల రాజేందర్ రావు తెలియజేశారు. ఆదివారం హైదరాబాద్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.

తనపై నమ్మకం ఉంచి పదవి కట్టపెట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. పార్టీని బలోపేతం చేయడంతో పాటు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగిరేలా కృషిచేస్తాన‌న్నారు. పార్టీ ప్రజా ప్రతినిధులు ముఖ్య నేతలతో కలిసి పని చేస్తామన్నారు.

Leave a Reply