Today’s Rasiphalalu| నేటి రాశిఫలాలు : 16.05.25

మేషం

కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంటుంది. వృథా ప్రయాణాలెక్కువ చేస్తారు. బంధు, మిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, ఉద్యోగరంగాల్లో సహనం వహించక తప్పదు.

వృషభం

అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలున్నా సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపార రంగాల్లో ధననష్టమేర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సహాయ, సహకారాలకై వేచివుంటారు. దైవదర్శనం లభిస్తుంది.

మిథునం

కుటుంబంలో సుఖ, సంతోషాలుంటాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యములు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధు, మిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.

కర్కాటకం

నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభయోగముంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది.

సింహం

ప్రయత్నకార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభమేర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూతన వస్తు, ఆభరణాలు పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. రుణబాధలు తొలగిపోతాయి. ధైర్య సాహసాలతో ముందుకెళ్తారు.

కన్య

ప్రయత్నకార్యాలకు ఆటంకాలెదురవుతాయి. బంధు, మిత్రులతో విరోధమేర్పడే అవకాశాలుంటాయి. స్త్రీలమూలకంగా శత్రుబాధలను అనుభవిస్తారు. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురి చేస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. పగ సాధించు ప్రయత్నాన్ని వదిలేయడం మంచిది.

.తులనూతన కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. ఆసక్మిక ధనలాభముంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. మనోల్లాసాన్ని పొంది, ఆనందంగా కాలక్షేపం చేస్తారు.

వృశ్చికం

కళాకారులకు, మీడియా రంగాలవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. కుటుంబసౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులను కలుస్తారు. పేరు, ప్రతిష్ఠలు సంపాదిస్తారు. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలను పొందుతారు

.ధనస్సు

అద్భుతమైన అవకాశాలను పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ, సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. అనుకోకుండా డబ్బు చేతికందుతుంది. నూతన వస్తు, ఆభరణాలు సేకరిస్తారు.

మకరం

వృత్తి, ఉద్యోగరంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలుంటాయి. ఏ విషయంలోనూ స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ, మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడుట మంచిది.

కుంభం

కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండడంతో మానసికానందాన్ని పొందుతారు. వృత్తి, ఉద్యోగరంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. నిన్నటి వరకు వాయిదా వేయబడిన కొన్ని పనులు ఈ రోజు పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు.

మీనం

ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధలతో బలహీనులవుతారు. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *