నేటి రాశిఫలాలు 3.03.25

మేషం: వ్యయప్రయాసలు. మిత్రులు, సన్నిహితులతో వైరం. ఆస్తుల వివాదాలు. ఒప్పందాలు వాయిదా వేస్తారు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

వృషభం: వ్యవహారాలలో పురోగతి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

మిథునం: పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వస్తు, వస్త్రలాభాలు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

కర్కాటకం: కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. విద్యార్థులకు కొంత నిరాశ. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగాలలో గందరగోళం.

సింహం: సోదరులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి.

కన్య: పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం. పనుల్లో విజయం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

తుల: విచిత్ర సంఘటనలు. విద్య, ఉద్యోగావకాశాలు. కొత్త పనులు చేపడతారు. వాహనయోగం. సోదరుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

వృశ్చికం: పనులు వాయిదా వేస్తారు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

ధనుస్సు: రాబడి కంటే ఖర్చులు అధికం. పనులు ముందుకు సాగవు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో మార్పులు.

మకరం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆస్తిలాభం. ఇళ్లు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ సత్తా చాటుకుంటారు.

కుంభం: పాత మిత్రుల కలయిక. ప్రయాణాలు వాయిదా. బంధువులతో తగాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందికరంగా ఉంటాయి.

మీనం: వ్యవహారాలలో పురోగతి. భూలాభాలు. వివాదాలు పరిష్కారం. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *