నేటి అలంకారము గాయత్రీ దేవి…

నేటి అలంకారము గాయత్రీ దేవి…

దుర్గానవరాత్రులలో రెండవ రోజైన విదియనాడు అమ్మవారిని గాయత్రి అవతారంలో అర్చిస్తాము. సకల మంత్రాలకు మూలశక్తి అయిన గాయత్రీదేవి ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో కూడిన అయిదు ముఖాలతో శంఖము. చక్రము, గద మరియు అంకుశం ధరించి దర్శనమిస్తుంది. గాయత్రిదేవిని త్రిశక్తి స్వరూపంగా భావిస్తారు. సమస్త మంత్రాలకు అధిష్టాన దేవత గాయత్రిదేవి. విశ్వామిత్ర మహర్షి గాయత్రి మంత్రాన్ని లోకానికి అందించారు. ఈ తల్లి వేదమాత. ఈ మాతను గాయత్రీ కవచంతో ఉపాసించేవారికి సర్వత్రా సిద్ధి భిస్తుంది. గాయత్రి అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రము, కనకాంబరాతో అంకరించాలి. ఈమెకు పాయసం, అల్లపు గారెలు నివేదన చేయాలి.


గాయత్రీ ధ్యానమ్‌

ఓం ముక్తావిద్రువహేమనీలధవళాచ్ఛాయైర్ముఖైస్త్రీక్షణై।
ర్యుక్తామిన్దునిబద్ధ రత్న మకుటాం తత్వార్థవర్ణాత్మికామ్‌॥
గాయత్రీం వరదాభయాంకుశాకశా పాశం కపాలం గదాం।
శంఖం చక్రమదారవిందయుగళం హస్తైర్వహంతీం భజే॥

శ్రీశైంలోని భ్రమరాంబ ఈ రోజు మయూర వాహనంపై బ్రహ్మచారిణిగా దర్శనమిస్తారు. అర్థాకృతిలోని చంద్రరేఖను శిరస్సుపై ధరించే రూపం చంద్రఘంట. ఈ రూపం మిక్కిలి కళ్యాణకారకం. ఈమెను శరణు జొచ్చిన వారికి ఎల్లప్పుడూ ఆభయఘంట మ్రోగుతూ విజయం ప్రసాదిస్తుంది.
శ్లో. దధానా కరపద్మాభ్యాం అక్షమాలాకమండలూ ! దేవే ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా !!

శుభం భూయాత్‌!!

డా. దేవులపల్లి పద్మజ
విశాఖపట్టణము

Leave a Reply