రోడ్డు ప్రమాదాల నివారించేందుకు..

రోడ్డు ప్రమాదాల నివారించేందుకు..

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం ఆధ్వర్యంలో పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్ బాబు, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ శుక్రవారం ఎన్ హెచ్ – 65 పై బ్లాక్ స్పాట్స్ పరిశీలించారు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని కేతనకొండ గ్రామానికి బస్సు యాత్ర చేరుకుంది. జిల్లా ప్రభుత్వ అధికారులతో కలిసి కేతనకొండ, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, వారధి, ఎనికేపాడు 24కే కల్యాణ మండపం వరకు ప్రత్యక్షంగా పరిశీలించి మొత్తం 28 బ్లాక్ స్పాట్స్ (రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలు)ను గుర్తించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తగు సూచనలు, చర్యలు చేపట్టనున్నారు. ఎన్ హెచ్ – 65 పై ఇబ్రహీంపట్నంలో ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నామని, ప్రజలంతా సహకరించాలని కోరారు. పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ.. రోడ్డు భద్రతా నిబంధనల పట్ల ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో డివైడర్ లు వెడల్పు తగ్గించడం, రింగ్ వెడల్పు తగ్గించడం, వేగ నియంత్రణ వంటి ప్రధాన అంశాలను గుర్తించామన్నారు. త్వరలోనే చర్యలు చేపడతామని తెలిపారు.

Leave a Reply