Tirupati | బాధ్యతల స్వీకరణ

Tirupati | బాధ్యతల స్వీకరణ
- ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్ తుడా వైస్ చైర్మన్ గోవిందరావు బాధ్యతలు స్వీకరణ
Tirupati | తిరుపతి తుడా, ఆంధ్రప్రభ : తుడా వైస్ చైర్మన్, జిల్లా ఇంచార్జ్ జాయింట్ సెక్రెటరీ గా ఆర్ గోవిందరావు నూతనంగా బాధ్యతలు చేపట్టారు. నూతనంగా తుడా వైస్ చైర్మన్, జిల్లా ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్ గా ఆర్ గోవిందరావు జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ ని మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో తన చాంబర్ నందు బాధ్యతలు స్వీకరించారు. ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్ ను డీఆర్ఓ నరసింహులు, తిరుపతి ఆర్టీవో రామ్మోహన్ తహసీల్దార్ రామాంజనేయులు నాయక్ మర్యాద పూర్వకంగా కలిసి స్వాగతం పలికారు.
