తిరుపతి చెన్నై రోడ్డు ధ్వంసం..

తిరుపతి చెన్నై రోడ్డు ధ్వంసం..

పుత్తూరు, ఆంధ్రప్రభ : తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చిత్తూరు జిల్లా నగిరి మున్సిపాలిటీ పరిధిలోని తిరుపతి–చెన్నై ప్రధాన రహదారిపై ఉన్న కుశస్థలి నదిపై రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో రవాణా పూర్తిగా స్థంభించిపోయి, వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రతిరోజూ ఈ మార్గం ద్వారా పెద్ద సంఖ్యలో ప్రజలు తమ గ్రామాలనుంచి తిరుపతి, చెన్నై వైపు ప్రయాణిస్తుండగా, రోడ్డు తెగిపోవడంతో రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు చేరుకోలేని పరిస్థితి నెలకొంది.

ఈ నేపథ్యంలో జిల్లా ప్రత్యేక అధికారి పి.ఎస్. గిరీషా మంగళవారం (28.10.2025) న నగిరి మున్సిపాలిటీ పరిధిలోని కిల్‌పెట్ బ్రిడ్జిని పరిశీలించారు. ఆయన పరిస్థితిని ప్రత్యక్షంగా గమనించి, అవసరమైన పునరుద్ధరణ చర్యలు తక్షణమే ప్రారంభించాలంటూ అధికారులకు సూచించారు.

స్థానికులు రహదారి పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని, ప్రజలకు సౌకర్యం కలిగేలా ప్రత్యామ్నాయ మార్గాలు తక్షణం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Leave a Reply