తుడుం దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కుడిమెత తిరుపతి

తుడుం దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కుడిమెత తిరుపతి

దండేపల్లి,ఆంధ్రప్రభ : ములుగు జిల్లా మేడారంలో ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర నూతన కమిటీని శనివారం ఎన్నుకున్నారని ఆ సంఘం నాయకులు తెలిపారు.ముందుగా సమ్మక్క సారాలమ్మ గద్దెలను డోలి వాయిద్యాలతో దర్శించుకున్నారు,ఈ సందర్భంగా ఐటిడిఎ క్యాంప్ ఆపీస్ భవనం లో 6 గంటలపాటు చర్చలు కొనసాగించింది.

అంతిమంగా తుడుం దెబ్బ తెలంగాణ రాష్ట్రమే గాక వివిధ రాష్ట్రాలలో విస్తరించి బలమైన ఉద్యమ శక్తిగా మారాల్సిన సందర్భం ఏర్పడిందని అన్నారు. అందుకే ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు తెలిపారు.అనంతరం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలానికి చెందిన కుడిమెత తిరుపతిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా ఎన్నుకున్నట్లు వారు తెలిపారు.

Leave a Reply