Tirumala | శీవారికి ‘కోటి’ ఇస్తే “కోటి” సేవ‌లు …

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. రూ. కోటి విరాళం ఇచ్చే భక్తులకు టీటీడీ ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తోంది. తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు జరిగే రోజులలో మినహా మిగిలిన రోజుల్లో రూ.కోటి విరాళం ఇచ్చిన భక్తులకు కల్పించిన ప్రత్యేక సౌకర్యాలపై ప్రకటన విడుదల చేసింది. శ్రీవారి భక్తులు సద్వినియోగం చేసుకోవచ్చని విజ్ఞప్తి చేస్తోంది. రూ. కోటి విరాళం ఇచ్చే దాతలకు జీవితకాలంలో దాతతో పాటు నలుగురికి ప్రతి ఏడాది పలు సౌకర్యాలను టీటీడీ కల్పిస్తోంది.

ఏడాదిలో 3 రోజులు సుప్రభాత సేవ, 3 రోజులు బ్రేక్ దర్శనం, 4 రోజుల పాటు సుపథం ప్రవేశ దర్శనం ద్వారా శ్రీ‌వారి దర్శనం చేసుకోవచ్చని పేర్కొంది. వీటితోపాటు 10 పెద్ద లడ్డూలు, 20 చిన్న లడ్డూలు, ఒక దుప్పట, ఒక రవికే, 10 మహా ప్రసాదం ప్యాకెట్లు, ఏడాదిలో ఒక సారి వేద ఆశీర్వచనం వంటి సౌకర్యాలను పొందవచ్చని స్పష్టం చేసింది. వీటితో పాటుగా రూ. 3 వేలు అద్దె విలువ చేసే వసతి గదుల సదుపాయం 3 రోజులు కల్పించనుంది.

అంతేకాకుండా జీవిత కాలంలో ఒకసారి దాతకు ఒక 5 గ్రాముల శ్రీవారి బంగారు డాలర్, ఒక 50 గ్రాముల సిల్వర్ డాలర్ ను తగిన ఆధారాలను కార్యాలయంలో చూపించి దాతలు పొందవచ్చని వారు టీటీడీ స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *