తిరుమల సమాచారం

తిరుమల సమాచారం
తిరుమల (ఆంధ్రప్రభ ప్రతినిధి):తిరుమలలో టోకెన్లు లేని భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామివారి సర్వదర్శనం కోసం సుమారు 12 గంటలు వేచి చూడాల్సి వస్తోంది. సర్వదర్శనం కోసం ప్రస్తుతం 18 కంపార్టుమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.
నిన్న రోజు మొత్తం 75,919 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 28,218 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.
శ్రీవారి హుండీ ద్వారా నిన్న రోజు రూ. 3.79 కోట్లు ఆదాయం లభించినట్లు తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు తెలిపారు.
