Tirumala | ఆ తరహా చట్టం యోచనలో ఏపీ సర్కార్

Tirumala | ఆ తరహా చట్టం యోచనలో ఏపీ సర్కార్
Tirumala | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఏపీ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పై కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలోనూ స్వర్ణ దేవాలయం తరహా చట్టాన్ని తీసుకొచ్చే ఆలోచనలో సర్కార్ ఉంది. ఈ చట్టం ద్వారా తప్పు చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశముంది. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో చంద్రబాబును పలువురు మంత్రులు కలిశారు.
ఈ అంశాలపై ముఖ్యమంత్రి వారితో చర్చించినట్లు తెలిసింది. సీఎం చంద్రబాబు స్వర్ణ దేవాలయం చట్టాన్ని వెంటనే అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. అన్యమతస్థులు శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధనను తప్పనిసరిగా అమలు చేయాలని, మరోవైపు టీటీడీ నిబంధనలను మరింత కఠినతరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
