టిప్పర్ల అతివేగం అదుపు చేయాలి

టిప్పర్ల అతివేగం అదుపు చేయాలి

కేంద్ర ప్రభుత్వ సహాయ న్యాయవాది రఘువీర్ యాదవ్ డిమాండ్

నారాయణపేట ప్రతినిధి (ఆంధ్రప్రభ ) : నారాయణపేట జిల్లాలో టిప్పర్లు అతివేగంగా, ఓవర్‌లోడ్‌తో దూసుకుపోతుండటం ఆందోళనకరమని కేంద్ర ప్రభుత్వ సహాయ న్యాయవాది రఘువీర్ యాదవ్ (Raghuveer Yadav) తీవ్రంగా విమర్శించారు. నిన్న వికారాబాద్ జిల్లాల్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాల్లో అనేకమంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో, నారాయణపేటలో కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొనకముందే అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

రఘువీర్ యాదవ్ మాట్లాడుతూ.. హైవేపై రోజు రోజుకు టిప్పర్ల ఓవర్‌లోడ్ (Overload), నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా వేలాది మంది విలువైన ప్రాణాలు బలి అవుతున్నాయి. తెలంగాణలో టిప్పర్లు మరణ మృదంగం మారుమోగిస్తున్నాయి. అనేకమంది గాయపడుతూ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జిల్లా కేంద్రంలో ట్రాక్టర్ల స్థానంలో ఇసుక, కంకర రవాణాకు టిప్పర్ల వాడకం పెరిగిందని, అధికారులు వీటి ఓవర్‌లోడ్‌ను పట్టించుకోకపోవడం ప్రమాదాలకు కారణమవుతోందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల నారాయణపేట పట్టణంలో స్కూటీపై వెళ్తున్న మహిళ, సుభాష్ రోడ్డుపై టూ-వీలర్ రైడర్ మృతి చెందిన సంఘటనలను ఉదాహరిస్తూ, అధికారులు మేలుకోవాలని కోరారు.

“ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయిన తర్వాత పోస్టుమార్టం చేయడం కంటే ముందు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమని రవాణా, పోలీసు, రెవెన్యూ శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో టిప్పర్ల అనుమతులను రద్దు చేయల్సిన అవసరం వస్తుందని రఘువీర్ యాదవ్ స్పష్టం చేశారు.జిల్లా వ్యాప్తంగా టిప్పర్ల డ్రైవర్లు నిర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేస్తుందడంతో ప్రజల్లో భయ బ్రంతులు నెలకొన్న నేపథ్యంలో వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజల తరఫున ఆయన అధికారులు కోరారు.

Leave a Reply