Adilabad | వామ్మో.. సరిహద్దుల్లో బెబ్బులి..!

కెస్లా ఘాట్ రోడ్డుపై పులి సంచారం


ఆదిలాబాద్ బ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ : కాగ‌జ్‌న‌గ‌ర్ (Kagaznagar) అటవీ డివిజన్ మహారాష్ట్ర (Maharashtra) స‌రిహ‌ద్దులోని ర‌హ‌దారిపై పెద్దపులి సంచారం కలకలం రేపింది. మంగ‌ళ‌వారం చంద్రపూర్ (Chandrapur) జిల్లా మూల్ తాలూకా కెస్లాగూడ రహదారిపై పెద్దపులి (Tiger) సంచరించ‌డంతో వాహ‌న‌దారులు ఒకింత ఆందోళ‌న చెందారు.

ఈ అటవీ ప్రాంతం నుండి రోడ్డు దాటుతుండగా వాహనదారులు పులి కదలికలపై తమ సెల్ ఫోన్ లో వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టారు. గత 4 నెలల క్రితం ఈ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తూ ముగ్గురు ప్రాణాలను బలిగొన్న సంఘటన అప్పట్లో కలకలం రేపింది. కాగా తిరిగి ఇదే ప్రాంతంలో కొత్తగా వలస వచ్చిన పెద్ద పులి సంచరిస్తున్నట్టు సరిహద్దు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మహారాష్ట్ర ఫారెస్ట్ అధికారులు తెలిపారు.

Leave a Reply