Tickets | మెదక్ అభ్యర్థుల జాబితా విడుదల..

Tickets | మెదక్ అభ్యర్థుల జాబితా విడుదల..
Tickets | మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : మెదక్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 31 వార్డులకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. మంగళవారం మున్సిపల్ ఎన్నికల ఇంచార్జి, మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్ పార్టీ అభ్యర్థుల తరపున అధికారులకు బీఫాంలను మున్సిపల్ కార్యాలయంలో అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని కులాలకు ప్రాధాన్యతనిస్తూ టిక్కెట్లు కేటాయించినట్లు వివరించారు. మున్నూరు కాపు, ముస్లింలకు 4, ముదిరాజ్, ఎస్సీ (మాదిగ) లకు 3, లింగాయత్, గౌడ్స్, వంజరి కులస్తులకు 2 చొప్పున టికెట్లు కేటాయించినట్లు తెలిపారు.
వీరితోపాటు ఎస్సీ (మాల), పూసల, యాదవ్, బుడగ జంగం, ఎరుకల, ఆర్య క్షత్రియ, కుంచెఎరుకల, క్రిస్టియన్, చాకలి, పద్మశాలి,మేర కులస్తులకు ఒకటి చొప్పున టికెట్టు బి ఫామ్ లు అందజేసినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, మాజీ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు యం. లావణ్య రెడ్డి తదితరులు ఉన్నారు.
మెదక్ మున్సిపాల్టీలో బీఆర్ఎస్ అభ్యర్థులు వీరే:
వార్డు నెంబర్ 1 చెప్యాల రాజవ్వ సంజీవ్, వార్డు 2 ఎరుకల ఎల్లయ్య, వార్డు 3 కొట్టాలా లలితా విశ్వం, వార్డు 4 ధర్మిశెట్టి స్వరూప, వార్డు 5 మామిళ్ళ ఆంజనేయులు, వార్డు 6 జీ. జీవన్ రావు, వార్డు 7 మాయ అనురాధ శ్రీనివాస్, వార్డు 8 మాయ గంగమణి మల్లేశం, వార్డు 9 ఎండి జుబేర్ అహ్మద్, వార్డు 10 వనం లత వెంకటేష్, వార్డు 11 కొండన్ సావిత్రి సురేందర్ గౌడ్, వార్డు 12 అనీస్ ఫాతిమా ఇమాడ్ అలీ, వార్డు 13 చెదల సంధ్య నవీన్ కుమార్, వార్డు 14 జక్కుల రమాదేవి లక్ష్మణ్, వార్డు 15 ఏ. గాయత్రి మల్లిఖార్జున్ గౌడ్, వార్డు 16 అవారీ రాజశేఖర్, వార్డు 17 బట్టి లలిత జగపతి, వార్డు 18 టేకి శంకర్, వార్డు 19 గొల్లబోయిన సునీల్, వార్డు 20 బొద్దుల నవీన్, వార్డు 21 ధర్మగల్ల సులోచన మహేష్, వార్డు 22 గౌస్ ఖురేషి, వార్డు 23 మాడబోయిన శ్రుతి సంతోష్, వార్డు 24 అంకం చంద్రకళ రవి, వార్డు 25 ఖాజా సోహెల్ మొహిద్దీన్, వార్డు 26 మ్యాధారి దీపక్, వార్డు 27 పల్లె రాణి బాల్ రాజ్, వార్డు 28 బండి పూజా నరేష్, వార్డు 29 బట్టి ఉదయ్, వార్డు 30 నింగమైల కిరణ్, వార్డు 31 ఆర్కె శ్రీను.
