Thunderbolt | పిడుగు పడి…

Thunderbolt | పిడుగు పడి…
Thunderbolt | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : జిల్లాలోని మందస మండలం పెద్దకేసుపురం గ్రామంలో ఆదివారం సాయంత్రం పిడుగు పడిన ఘటనలో తల్లి, కుమార్తె మృతి చెందారు. పెద్దకేసుపురం గ్రామానికి చెందిన కృష్ణవేణి(35), ఆమె కుమార్తె చిన్ని(15) ఇద్దరూ జీడితోటలో పనిచేస్తుండగా సాయంత్రం ఒక్కసారిగా ఆకాశంలో మబ్బులు వేసి వీదురుగాలులు వీచాయి.
అదే సమయంలో వారు పనిచేస్తున్న జీడి తోటలో పెద్ద శబ్దంతో పిడుగులు పడడంతో అక్కడే పనిచేస్తున్న తల్లి, కూతురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిద్దరు చనిపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అక్కడకు చేరుకొని విలఫించారు. ఈ ఘటనతో పెద్దకేసుపురంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

