బైపోల్లో త్రిముఖ పోటీ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజకీయ వర్గాల్లో కాక పుట్టిస్తోంది. ఇప్పటికే ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో అన్ని రాజకీయ పార్టీలు నియోజకవర్గంపై ప్రధానంగా దృష్టి సారించాయి.
ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేయకున్నా ప్రచారంలో దూసుకుపోతున్నారు.
ఉప ఎన్నిక పోరులో ప్రధానంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు గులాబీ దళం ప్రయత్నిస్తుండగా.. 22 నెలల పాలనకు రెఫరెండమ్‌గా అధికార కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.
ఇక బీజేపీ నగరంలో పట్టు పెంచుకునేందుకు ప్రభుత్వ వ్యతిరేకత, హామీల అమలులో సర్కార్ వైఫల్యాలను ఎత్తి చూపేందుకు, ఉప ఎన్నికను ఉపయోగించుకోవాలని చూస్తోంది.
అయితే, ఓటర్లు ఎవరికి పట్టం కడతారనే అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
ఈ పోరులో గెలుపెవరిది? ఓటర్ల అభిప్రాయాలేమిటి? క్షేత్రస్థాయిలో ఆంధ్రప్రభ స్పెషల్ వీడియో లో ఈ క్రింది లింక్ లో మీకోసం.