Threatening Call | “చంపేస్తా” … మోదీకి బెదిరింపు కాల్

పాట్నా – ప్రధాని మోదీని చంపేస్తామంటూ బెదిరింపు కాల్ రావడం సంచలనం రేపింది. ప్రధాని బిహార్ లో పర్యటిస్తున్న సమయంలో ఈ బెదిరింపులు రావడంతో నిఘా అధికారులు అప్రమత్తమయ్యారు. మోదీని చంపేస్తానని కాల్ చేసిన 35 ఏళ్ల సమీర్ కుమార్ రంజన్ ను అరెస్ట్ చేశారు. అతడిని విచారించగా కీలక విషయాలు బహిర్గతమయ్యాయి. ఇక రంజన్ మెట్రిక్యులేషన్ కూడా పాస్ కాలేదని… కీప్యాడ్ మొబైల్ ఫోన్తో బెదిరింపులకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. కావాల‌నే బెదిరింపు కాల్ చేసిన‌ట్లు నిందితుడు అంగీక‌రించాడు.. దీంతొ అత‌డిపై కేసు న‌మోదు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజ‌రుప‌రిచారు..

Leave a Reply