తీర్థ‌యాత్ర‌కు వెళ్లొచ్చేస‌రికి..

తీర్థ‌యాత్ర‌కు వెళ్లొచ్చేస‌రికి..

ఇంటికి కన్నం వేసి దొంగతనం


జుక్కల్ (కామారెడ్డి) : కార్తీక ఏకాదశిని పుర‌స్క‌రించుకుని కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ మండలం నాగల్ గాం గ్రామానికి చెందిన ఘనువిజయ్ పటేల్ దంపతులు మహారాష్ట్ర (Maharashtra) లోని పండర్ పూర్ దేవస్థానానికి వెళ్లారు. బుధవారం రాత్రి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో దొంగతనం జరిగింది. పెంకుటిల్లు బంగ్లా మీదా కన్నం వేసి, రంధ్రలు చేసి దొంగలు చొరబడి ఇంట్లో ఉన్న సామ‌గ్రిని చిందరవందరగా చేయడమే కాకుండా, ఒక మాసం బంగారం, ఆరు తులాల వెండి, మూడు వేల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు.

గురువారం ఇంటి యజమాని విజయ్ పటేల్ (Vijay Patel) జుక్కల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, స్పందించిన జుక్కల్ పోలీసులు క్లూస్ టీం కు రప్పించి వేలిముద్రలను సేకరించారు.నాగల్ గాం గ్రామంలో దొంగలు పై కప్పుకు రంధ్రం చేసి దొంగతనానికి పాల్పడటంతో గ్రామస్తులు భయఆందోళనకు గురవుతున్నారు.

Leave a Reply