Thief | వాచ్‌మెన్ కు మత్తు మందు ఇచ్చి..

Thief | వాచ్‌మెన్ కు మత్తు మందు ఇచ్చి..

Thief | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : వామ్మో.. వీళ్లు మామూలు దొంగలు కాదు… ఇంటికి కాపలాగా ఉండే వాచ్ మెన్ కు మత్తు మందు ఇచ్చి.. చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన నగరంలోని జూబ్లీహిల్స్‌లో చోటుచేసుకుంది. నేపాలీ ముఠా.. ఓ అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌ సహా పని మనుషులకు మత్తు మందు కలిపిన కూల్‌ డ్రింక్‌ ఇచ్చి చోరీకి పాల్పడింది. గత రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

Thief

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందగిరి హిల్స్‌లోని ఓ ఇంట్లో నేపాల్‌కు చెందిన భువన్‌ అనే వ్యక్తి 15రోజుల క్రితం వంటమనిషిగా చేరాడు. తన పుట్టినరోజు అంటూ వాచ్‌మెన్‌ సహా అక్కడి పనివారికి భువన్‌ మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్‌ ఇచ్చాడు. అందరూ అపస్మారక స్థితిలోకి వెళ్లాక.. మరో ముగ్గురు నేపాలీలతో కలిసి భువన్‌ చోరీకి పాల్పడ్డాడు. ఇంట్లోని బంగారు ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్లారు. పథకం ప్రకారం తమ చోరీ పనిని అమలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీకి గురైన సొత్తు విలువ సుమారు రూ.20లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Leave a Reply