ఇవేం రోడ్లు నాయనా..

ఇవేం రోడ్లు నాయనా..
తాడ్వాయి, ఆంధ్రప్రభ – జాతీయ రహదారి 163వ రోడ్డు పనుల్లో నాణ్యత చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. తాడ్వాయి మండల కేంద్రంలో వేసిన 2 కిలోమీటర్లు నాలుగు లైన్ల రోడ్డు పనులు నాణ్యత లేకపోవడంతో గుంతలు, పగుళ్ళు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ.. ఆర్ అండ్ బీ అధికారులు పటించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఇప్పటికైనా ఆర్ అండ్ బీ అధికారులు గుంతలు పడిన రోడ్డును పూడ్చి ప్రమాదాలను నివారించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
