IPL 2025 | ఈ సీజ‌న్ న‌యా కెప్టెన్లు వీరే…

9 మందీ ఇండియ‌న్లే !

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( ఐపీఎల్) 2025 18వ‌ సీజన్‌కు రంగం సిద్దమైంది. ఈ మెగా టోర్నమెంట్ మ‌రో 8 రోజుల్లో ప్రారంభం కానుండటంతో క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.

కాగా, ఈ క్యాష్ రిచ్ లీగ్ ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా తెరలేవనుంది. మ్యాచ్ 22న డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య కోల్‌కతా వేదికగా జరిగే తొలి మ్యాచ్‌తో ఈ ధనాధన్ లీగ్ ప్రారంభం కానుంది.

అయితే, ఈ మెగా టోర్నమెంట్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటుండగా, ఈసారి ప‌లు జట్లకు కొత్త కెప్టెన్లు నాయకత్వం వహించనున్నారు. కాగా, 10 జట్లలోని 9 జట్లకు భారత ఆటగాళ్లకే కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించాయి ఆయా ఫ్రాంచైజీలు. మ‌రి ఈ సీజ‌న్ లో త‌మ జ‌ట్ల‌ను ముందుండి న‌డిపించే కెప్టెన్లు ఎవ‌రో చూద్దాం..

IPL 2025 కెప్టెన్ల పూర్తి జాబితా

చెన్నై సూపర్ కింగ్స్ – రుతురాజ్ గైక్వాడ్
ఢిల్లీ క్యాపిటల్స్ – అక్షర్ పటేల్
గుజరాత్ టైటాన్స్ – శుభ్‌మన్ గిల్
కోల్‌కతా నైట్ రైడర్స్ – అజింక్య రహానే
లక్నో సూపర్ జెయింట్స్ – రిషబ్ పంత్
ముంబై ఇండియన్స్ – హార్దిక్ పాండ్యా
పంజాబ్ కింగ్స్ – శ్రేయాస్ అయ్యర్
రాజస్థాన్ రాయల్స్ – సంజు సామ్సన్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – రజత్ పాటిదార్
సన్‌రైజర్స్ హైదరాబాద్ – పాట్ కమ్మిన్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *