- దళారుల బెడద ఉండదు
- నాణ్యమైన ఇసుక పంపిణీ
- మంత్రి దామోదర రాజనర్సింహ
జోగిపేట : ఇసుక మార్కెట్ ( sandy bazar) ద్వారా నాణ్యమైన ఇసుక పంపిణీ చేయనున్నామని, ఇందిరమ్మ లబ్ధిదారులకు తక్కువ ధరలో నాణ్యమైన ఇసుక సరఫరా చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ( state health minister Damodara rajanarimham) అన్నారు. మంగళవారం జోగిపేట మున్సిపల్ పరిధి (jogipeta muncipality)లోని అందోల్ (Andol) సమీపాన రాష్ట్ర మైనింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (state maining development corparation) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇసుక మార్కెట్ (sandy bajar) ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళారుల బెడద లేకుండా, పారదర్శక పద్ధతిలో నేరుగా ప్రజలకు ఇసుక అందించేందుకు ప్రభుత్వం శాండ్ బజార్ (Sand Bazar) లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి 20 కిలోమీటర్ల పరిధిలో శాండ్ బజార్ ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నమన్నారు. ప్రజలు తక్కువ దూరంలోనే అవసరమైన ఇసుకను సులభంగా పొందగలరని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడటమే లక్ష్యమని స్పష్టం చేశారు.
జిల్లాలో సహజసిద్ధమైన ఇసుక రీచ్‌లు లేవని, ఇక్కడి ప్రజలు అధిక ధరలకు మధ్యవర్తుల ద్వారా ఇసుక కొనుగోలు చేశారని మంత్రి అన్నారు. ఇకపై లబ్ధిదారులు, గృహనిర్మాణదారులు తక్కువ ధరలో నాణ్యమైన ఇసుకను బజార్ల ద్వారా పొందవచ్చని తెలిపారు. ఇసుక కొరత సమస్యకు శాశ్వత పరిష్కారం లభించినట్లు అయిందన్నారు.
ఇసుక సరఫరా ప్రక్రియలో ఎవరైనా దళారుల మాదిరిగా వ్యవహరించినా, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సాండ్ బజార్లో ఇందిరమ్మ లబ్ధిదారులకు టన్ను ఇసుకకు రూ.1200, ఇతరులకు రూ.1800 అందిస్తున్నామన్నారు. బయట మార్కెట్ కంటే రూ. 1000 తక్కువ ధరకే లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమం లో టీజీఎండీసీ ఎండి భవేష్ మిశ్రా , జిల్లా అదనపు ( స్థానిక సంస్థలు)కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా మైన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ రఘుబాబు తదితరులు పాల్గొన్నారు.