అధికారులు ఎక్కడ..?
చిట్యాల(ఆంధ్రప్రభ): నల్గొండ జిల్లా (Nalgonda district) చిట్యాల పట్టణ కేంద్రంలో రైల్వే బ్రిడ్జి కింద భారీగా వర్షపు నీరు చేరడంతో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి పై భారీగా వాహనాలు నిలిచాయి. నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ – విజయవాడ రహదారి పై చిన్న సమస్య వచ్చినా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడుతుంది.
రైల్వే బ్రిడ్జి కింద నిన్న మొన్న కురిసిన భారీ వర్షాల వలన నీరు చేరడంతో ఆ నీటిని తొలగించకపోవడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. జాతీయ రహదారి (National Highway) పై 5 కిలోమీటర్ల మేర వాహనాలు క్యూ కట్టాయి. దీంతో వాహనాదారులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. టోల్గేట్ సిబ్బంది కానీ నేషనల్ హైవే సంబంధించిన అధికారులు కానీ ఎవరు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

