ఇక్కడ రాకపోకలు బంద్..
నంద్యాల బ్యూరో, అక్టోబర్ 29 ఆంధ్రప్రభ : రాష్ట్రాన్ని తీవ్రంగా వణికించిన మొంథా తుఫాను ప్రజల జీవన వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నంద్యాల జిల్లా (Nandyal District) అతలాకుతలమైంది. వరద నీరు ఇళ్లలోకి వచ్చింది. వాగులో వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరద నీరు దేవాలయాలను సైతం వదలటం లేదు. జిల్లాలోని 29 మండలాలలో అత్యధిక వర్షపాతం నమోదయింది. ఒక్క రోజులోనే 2694.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం విశేషం. జిల్లాలో అత్యధికంగా వర్షపాతం శ్రీశైలంలో 269.8 మిల్లీమీటర్ల నమోదు కావటం విశేషం. జిల్లాలోని సంజామల మండలంలో ఉచితంగా ప్రవహిస్తున్న వాగులోకి ఆర్టీసీ బస్సు వెళ్లడంతో రోడ్డు కనపడినప్పటికీ వెళ్లడంతో గుంతలోకి ఆర్టీసీ బస్సు వెళ్ళిపోయింది.

సమయానికి గ్రామస్తులు వచ్చి ఆర్టీసీ బస్సులో ఉన్న 20మంది ప్రయాణికులను కాపాడారు. పట్టణంలోని ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయంలో వరద నీరుతో దేవాలయం అంతా ఐదు అడుగుల నీరు చేరటం విశేషం. జిల్లాలోని కుందునది పాలేరు వంక, భవనసి, కొండ వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రహదారులు తెగిపోయాయి. బండి ఆత్మకూరు (Bandi Atmakur), మహానంది ఆళ్లగడ్డ, రుద్రవరం, సిరివెళ్ల సంజామల, ఉయ్యాలవాడ, ఆత్మకూరు, వంటి పలు మండలాలలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాల్లోని ఎస్సీ కాలనీ, బరకాల కాలనీ రోడ్డు వెళ్లే మార్గం మొత్తం జలమయంగా మారాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను ట్రాక్టర్ ల సాయంతో సురక్ష ప్రాంతాలకు తరలిస్తున్నారు. జిసి పాలెం గ్రామంలో మద్దిలేరు వాగు ఉప్పొంగి గ్రామం లోనికి నీరు చేరింది. సమీపంలోని ఆంజనేయస్వామి దేవాలయం ను వాగు నీరు చుట్టూముట్టింది.
తుఫాను తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు (Officers orders) జారీ చేశారు. నల్లమల అటవీ ప్రాంతంలో తుఫాను కారణంగా కురుస్తున్న వర్షాల వల్ల పాలేరు వాగు 4 అడుగుల మేర ప్రవహిస్తున్న ఉధృతి దృష్ట్యా వాహనదారుల రాకపోకలకు సంబంధించి పోలీస్, రెవెన్యూ సంయుక్తంగా సిబ్బందిని ఏర్పాటు చేయడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. జిల్లాలో 23254 మట్టి మిద్దెల్లో నివసించే వారు సురక్షిత ప్రాంతాలకు లేదా బంధుమిత్రుల ఇల్లల్లో తాత్కాలికంగా షెల్టర్ తీసుకోవాలని సూచించారు. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నారు. పట్టణంలోని పలు రహదారులలో సిసి రోడ్లు లేక ఒక సైడు వీధి కాలువలు లేక వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. బురదలో మోకాళ్ల లోతు నీటిలో విష పురుగుల బారినపడి అంటు రోగాలతో ఇక్కడి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
వాహనాలు దారి మళ్లింపు…
నల్లమల అడవి లో కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారిపోయాయి. గుంతల మయం అయిపోయాయి. జిల్లాలోని ఆత్మకూరు నుంచి దోర్నాలకు వెళ్లే రహదారిని వరద నీరు ఉధృతంగా రోడ్లపై ప్రవహించటంతో పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. ఆత్మకూర్ నుంచి దోర్నాలకు వెళ్లే రహదారి మూసివేయడంతో ఆత్మకూరు నుంచి నంద్యాల గిద్దలూరు మీదుగా వెళ్లాలని సూచించారు. పట్టణంలోని పలు జలమయమైన కాలనీలోని వాసుల కుటుంబాలు ఎనిమిది వందల కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. అధికారులు వారికి అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నారు.

9874 హెక్టార్ల పంట నీటిపాలు…
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మల్పపీడనం మూలంగా జిల్లాలో అత్యధిక వర్షాలు కురుస్తున్నాయి. చేతికొచ్చిన పంట నీటి పాలవుతున్నాయి. జిల్లాలో వరి పంట మొక్కజొన్న పసుపు అరటి నిన్ను పెసలు పంటలు నీటిపాలయ్యాయి. పాల దశలో ఉన్న వరి పంట వరద నీటిలో మునిగిపోయింది. అరటి తోటలు ధ్వంసమయ్యాయి. పసుపు పంట నీటిపాలైంది. జిల్లాలో సుమారు 9874 హెక్టార్ల వివిధ రకాల పంటలు నీటి పాలు కావటం విశేషం. సర్వే నిర్వహించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.

