బొంతలో చేపలు గల గల

బొంతలో చేపలు గల గల

ఆంధ్రప్రభ , చింతూరు (ఏఎస్‌ఆర్‌ జిల్లా), ఆధునిక యుగంలో దేశంలో అబ్బురపరిచే, అత్యాధునిక కట్టడాలు ఒక పక్క నిర్మిస్తుంటే ఆ కట్టడాలకు దీటుగా ఏజేన్సీలొ ఆదివాసీలు వేట కోసం అద్భుత కట్టడాలు నిర్మిస్తూ తమ సంస్కృతీ, సంప్రదాయాలకు అత్యంత విలువనిస్తున్నారు. ఆదివాసీ వేటగాడి మదిలో పుట్టిన వలపు వల ”బొత్త” ఇది ఒక వేటగాడి వల ! కట్టడమే అందుకు నిదర్శనం.

చింతూరు ఏజేన్సీలోని మారుమూల పల్లె అయిన పెద్దశీతనపల్లిలో ఓ ఆదివాసీ చేపల వేటగాడు బొత్త పేరుతో ఏర్పాటు చేసిన చేపల వల అబ్బురపరిచే విధంగా ఉంది. నదులపై నీరును నిలిపేందకు అడ్డుగా ఆనకట్టలు ఏలా నిర్మిస్తారో ఆ అనకట్టలను అనుసరిస్తూ మన్యంలో మాములుగా వాగులకు అడ్డంగా చేపలను సులభంగా పట్టుకోవడం కోసం ”తేలే” నిర్మాణం చేపడతారు.

చేపలకు వలపు వల

చింతూరు మండలంలోని పెద్దశీతనపల్లి గ్రామానికి చెందిన శ్యామల చిన్న రాజులు అనే గిరిజనడు చేపలకు పట్టడానికి తన మదికి పదును పెట్టి ఆ మదిలో పుట్టిన వలపు వలకు నాంది పలికాడు. అదే తడువుగా ఆదివాసీ వేటగాడు చేపలను సులభంగా పట్టుకునేందకు సరికొత్త పద్దతి ఎంచుకున్నాడు. ఆ గ్రామ శివారు ప్రాంతంలో సోకిలేరు వాగు ఒడ్డు వద్ద ఒక చేపల కట్టడం నిర్మించాడు.

ఒడ్డు ప్రాంతాన్ని కలుపుకొని మూడు వైపులా 10 అడుగుల వెడల్పు, 10 అడుగుల పోడవునా చిన్న చిన్న వెదురులతో కంచెను ఏర్పాటు చేసి ఆ కంచెకు తాటాకులను చుట్టూ పేర్చి కట్టుదిట్టంగా కట్టడాన్ని ఏర్పాటు చేశాడు. ఆ కట్టడంలో ఒక వైపు మాత్రం చిన్న రంధ్రాన్ని ఏర్పాటు చేసి అందులో నుండి చేపలు వచ్చేలా పన్నాగంతో వల పన్ని చేపలకు దారి ఏర్పాటు చేశాడు.

ఆ వలలో చేపలు ఆగాల్సిందే

ఆదివాసీ వేటగాడి మదిలో వలపు వల చేపల వేటకు అయింది సులభం. ఆయన కట్టిన బొత్త కట్టడంలో ప్రతి రోజు చేపల కోసం అన్నం, వరి పొట్టు, నూకలతో పాటు చేపలు తినే ఇతర పదార్ధాలను ఆ బొత్తలో వేస్తాడు ఇలా రెండు మూడు రోజుల పాటు వేయడం ఆ మేతలను తినడానికి చేపలు బొత్తకు (చేపల వలకు) ఏర్పాటు చేసిన ద్వారం నుండి అందులోకి వస్తాయి. ఆ బొత్తలోకి వచ్చిన చేపలను బయటకు వెళ్ళనీయకుండా వినూత్నంగా ప్రజలకు మౌళిక సదుపాయాలు కల్పించినట్లు ఆ బొత్తలో వచ్చిన చేపలు బయటకు పోకుండా పచ్చటి ఆకులు, చెత్తా, చెదారంతో పచ్చి కొమ్మలు, వెదురు కొమ్మలు వేశాడు.

ఆ చేపలు వచ్చి ఆహారాన్ని హాయిగా సేదతీరుతున్న సమయంలో వచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రంధ్రాన్ని తలుపులా చేసిన దానితో మూసివేస్తాడు. అలా చేపలు ఆ గిరిజన వేటగాడు పన్నిన వినూత్నపు వలపు వలలో పడి ఆ వలలోనే ఆగిపోయి ఆయన ఆహారంగా మిగులుతాయి. ఇలా సులభంగా పడ్డ చేపలను ఆయన తనకు ఆహారంగా చేసుకుంటున్నాడు.

Leave a Reply