Thefts | 1000 లీటర్ల డీజిల్ స్వాధీనం..

Thefts | 1000 లీటర్ల డీజిల్ స్వాధీనం..
Thefts | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రోడ్డుపక్కన నిలిపిన వాహనాల నుంచి డీజిల్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాను నల్గొండ పోలీసులు అరెస్ట్ చేశారు. భారీగా డీజిల్‌తో పాటు వాహనాలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
రోడ్డుపక్కన నిలిపి ఉంచిన వాహనాలను లక్ష్యంగా చేసుకుని డీజిల్ దొంగతనాలు చేస్తున్న ముఠాను నల్గొండ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో మైనర్ సహా ఆరుగురు అంతరాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశారు.
నిందితుల వద్ద నుంచి సుమారు 1000 లీటర్ల డీజిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే రెండు డీసీఎం వాహనాలు, ఆరు మొబైల్ ఫోన్లను కూడా పోలీసులు సీజ్ చేశారు. ఈ ముఠాపై తెలుగు రాష్ట్రాల్లో 20కి పైగా డీజిల్ దొంగతనాల కేసులు ఉన్నట్లు జిల్లా అదనపు ఎస్పీ జి. రమేష్ వెల్లడించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
