- కుటాగుళ్ల పోస్ట్ ఆఫీస్ సహా నాలుగు చోట్ల చోరీ
- రూ.4 లక్షల నగదు, ఏడు తులాల బంగారు చోరీ
శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నుంచి ముదిగుబ్బ వరకు దొంగలు వరుస చోరీలకు పాల్పడ్డారు. కదిరి పట్టణ సమీపంలోని కుటాగుళ్ల పోస్ట్ ఆఫీస్ తో పాటు కదిరి రూరల్ మండలంలో దొంగలు ఏకంగా నాలుగు చోట్ల తాళాలు పగలగొట్టి దొంగలించిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది.
స్థానికుల వివరాలు మేరకు మండల పరిధిలోని నడింపల్లి గ్రామంలో గురువారం రాత్రి ఏకంగా మూడు ఇళ్లల్లో తాళాలు పగలగొట్టి దుండగులు చొరబడి దొంగతనం చేశారు. షేక్ మొహమ్మద్ బాధితుడు ఇంటి వెనుక భాగంలో గేదెలు వద్ద నిద్రిస్తున్న సమయంలో తాళాలు పగలగొట్టి ఇంటిలోకి వెళ్లి బీరువాలో ఉన్న రూ. 1.25వేలు ఎత్తుకెళ్లారు.
ఈ క్రమంలోనే పక్కనే ఉన్న షేక్షావలి ఇంటిలోకి చొరబడి రూ.25000 నగదు, గంగరాజు అనే మరో వ్యక్తిఇంటిలో ఎవరు లేరు అని గుర్తించి, రెండు జతలు కమ్మలు వెండి పట్టీలు తోపాటు కుటాగుళ్ల పోస్ట్ ఆఫీస్ నందు తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న ఖాతాదారుల సొమ్ము రూ 1.25వేలు దోచుకెళ్లారు.
అదేవిధంగా ముదిగుబ్బ మండల కేంద్రంలోని నాయి బ్రాహ్మణుల కాలనీలో రమణమ్మ అనే ఆమె తన ఇంటికి తాళం వేసి పక్కింటిలో నిద్రించింది. ఉదయం ఇంటికి చూసేసరికి బీరువా పగలగొట్టి అందులో ఉన్న లక్ష 30 వేలు చేసే బంగారు ఆభరణాలను దొంగలు చోరీ చేసినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇలా ఒకే రోజు ఏకతాటిగా నాలుగు చోట్ల ఒకే రాత్రి దొంగతనం జరగడంతో ఆయా ప్రాంతాల గ్రామ ప్రజలు భయందోనలకు గురవుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ దొంగతనం జరిగిన ఘటన ప్రాంతాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.