ఆలయంలో దొంగని ఎలా పట్టుకున్నారంటే..

ఆలయంలో దొంగని ఎలా పట్టుకున్నారంటే..
యడ్లపాడు, ఆంధ్రప్రభ : యడ్లపాడు గ్రామంలోని శ్రీ ప్రపత్తి ఆంజనేయస్వామి ఆలయానికి చెందిన వెండి, బంగారు ఆభరణాల దొంగతనం కేసుకు సంబంధించి నిందితుడ్ని అరెస్ట్ చేసి సొత్తు స్వాధీనం చేసుకోవటం జరిగిందని ఎస్సై టి శివరామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వివరిస్తూ.. నిందుతుడు యడ్లపాడు గ్రామానికి చెందిన మద్దుల రమణారావు అని, ఇతనిని మంగళవారం సాయంత్రం 07.00 గంటల సమయంలో తెనాలి పట్టణంలోని తెనాలి టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్న బజారు ప్రాంతంలో అదుపులోకి తీసుకోని అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు. కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తున్న సమయంలో నిందితుడు మద్దుల రమణారావును అదుపులోకి తీసుకున్నామన్నారు.
అనంతరం నిందితుడు తన వాంగ్మూలంలో తాను దొంగిలించిన వెండి, బంగారు ఆభరణాలు యడ్లపాడు ఆంజనేయ స్వామి ఆలయానికి చెందినవని, అలాగే వాటిని కనమర్లపూడి శ్రీహరిరావు ఇంటి వద్ద దాచినట్లు చెప్పాడు. దీని పై దర్యాప్త అధికారి, మధ్యవర్తుల సమక్షంలో సూచించిన ప్రదేశానికి వెళ్లి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. గ్రాములు, రెండు జతల ఉత్తర జంద్యాలు -14 గ్రాములు, మెట్టెలు, పిల్లేళ్లు – 20 గ్రాములు, బంగారు ఆభరణాలు మంగళసూత్రం – 4 గ్రాములు, రెండు జతల బంగారు నేత్రాలు – 10 గ్రాములు మొత్తం స్వాధీనం చేసిన వెండి 216 గ్రాములు, బంగారం 14 గ్రాములు. పై ఆభరణాలను యడ్లపాడు ఆంజనేయ స్వామి ఆలయానికి చెందిన చోరీ సొత్తుగా గుర్తించి, తదుపరి దర్యాప్తు నిమిత్తం స్వాధీనం చేసుకుని, నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

