Theft | ఇంట్లో ఎవరూలేని సమయంలో..

Theft | ఇంట్లో ఎవరూలేని సమయంలో..

Theft | వెబ్ డెస్క్, ఆంధ్ర‌ప్ర‌భ : శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో భారీ చోరీ జరిగింది. చిన్న పిల్లల వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ నగేశ్ జీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలోని డాక్టర్స్ అపార్ట్ మెంట్లో నివాసం ఉంటున్నారు. ఇంట్లో ఎవరూలేని సమయంలో చోరీకి పాల్ప‌డ్డారు. గుర్తు తెలియని దుండగులు 1,250 గ్రాముల బంగారం, కిలో వెండి దోచుకెళ్లారు. దీంతో బాధితుడు నగేశ్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. చీపురుపల్లి డీఎస్పీ ఎస్ రాఘవులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి త్వరలో దుండగులను పట్టుకుంటామని పేర్కొన్నారు.

Leave a Reply