ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సినిమా ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో తాజాగా సినిమా ఎగ్జిబిటర్లు సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఏకంగా 65 మంది ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. వారు ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు.
ఈ సమావేశంలో జూన్ 1 నుండి థియేటర్లను నిరవధికంగా మూసివేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. సినీ పరిశ్రమలో ఇకపై అద్దె ప్రాతిపదికన సినిమాలను ప్రదర్శించలేమని వారు తేల్చి చెప్పారు. అద్దె ప్రాతిపదికన సినిమాల ప్రదర్శన ద్వారా తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని థియేటర్ల ఓనర్లు తెలిపారు. సినిమా వసూళ్లలో వాటా పద్ధతిని అమలు చేస్తేనే థియేటర్లను కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.
నిర్మాతలు తమ నిర్ణయాన్ని గౌరవించి తమకు సహకరించకపోతే జూన్ 1 నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లను మూసివేయాలని వారు నిర్ణయించారు.