ముహుర్తం బాగా లేదని..

ముహుర్తం బాగా లేదని..
ఆలేరు, ఆంధ్రప్రభ: ఆలేరు మున్సిపల్ పరిధిలో గెలుపొంది ఈనెల 16న ముహూర్తం బాగా లేదన్న కారణంగా ప్రమాణ స్వీకారం చేయని బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల చేత ఈనెల 26న ప్రమాణ స్వీకారం చేయించాలని అధికారులు నిర్ణయించారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు కోమల్ల(పాకాల) మౌనిక, హరీష్, యాట శివకుమార్, బీజేపీ కళ్యాణి మధు, బీజేపీ కౌన్సిలర్లు పాశికంటి సంపత్, బొట్ల సంపత్ ప్రమాణం చేయనున్నారు. అదే విధంగా ఇది వరకే ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్, వైస్ చైర్మన్ తమ బాధ్యతలను చేపడతారు. మున్సిపల్ కమీషనర్ కె శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సభ్యుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లను చేశారు.
