- 1977 -78 సంవత్సరంలో జలగం వెంగళరావు
- 2004-05 డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి..
- తాజాగా నారాచంద్రబాబునాయుడు
శ్రీ సత్య సాయి బ్యూరో, అక్టోబర్ 31 (ఆంధ్రప్రభ ): శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం తలుపుల మండల కేంద్రంలోని పెద్దన్నవారిపల్లి గ్రామంలో శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు వృద్ధులు, వితంతు పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. ఇప్పటివరకు తలుపుల… మండల చరిత్రలో మండలాన్ని సందర్శించిన వారిలో 1977-78 లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు మండల కేంద్రంలో జరిగిన సంక్షేమ వసతి గృహం, ప్రకాష్ నగర్ కాలనీ ప్రారంభోత్సవం చేశారు. అనంతరం 2004-05 లలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి పల్లెబాట కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలో పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, రైతు సంబంధించిన సమస్యలను ప్రస్తావిస్తూ పల్లెబాట కార్యక్రమం నిర్వహించారు. ఇక తాజాగా తలుపుల మండల కేంద్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు పర్యటించబోతున్నారు. ఇప్పటివరకు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, వైయస్ రాజశేఖర్ రెడ్డి మండలంలో పల్లె పాట కార్యక్రమంలో పర్యటించారు.ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదాలో మూడో వ్యక్తిగా నారా చంద్రబాబు నాయుడు శనివారం మండలానికి రానున్నారు. ఇక చంద్రబాబు నాయుడు కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా మండలానికి రానున్నారు. ఆయన లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు వస్తున్న ఈ ప్రాంతంలో ఏదైనా పరిశ్రమలు గాని ఇతరత్రా ఉపాధి అవకాశాలు కల్పిస్తారేమోనని.. అందుకు ఏదైనా హామీలు కురిపిస్తారని ఈ ప్రాంత వాసులు ఎదురుచూస్తున్నారు.

