తెగిన పుట్టవాండ్లపల్లి నుంచి వెళ్లే తారు రోడ్డు

మూడు గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు

యర్రావారిపాలెం అక్టోబర్ 29 (ఆంధ్రప్రభ):మండలం లోని ఉదయం మాణిక్యం గ్రామం కొట్టావాండ్లపల్లి హరిజనవాడకు వెళ్లే దారి సమీపంలో గాజలేరు గత మూడు రోజులగా కురిసిన వర్షాల వలన ఉదృతంగా ప్రవహిస్తుండటం వల్ల పుట్టవాండ్లపల్లి నుంచి వెళ్లే తారు రోడ్డు తెగిపోయింది. ఈ ఏరు దాటుకొని వెళ్లేందుకు పుట్టవాండ్లపల్లి, తొప్పిరెడ్డిగారిపల్లి, మర్రిపాటివారి పల్లి మూడు గ్రామాల ప్రజలు రాకపోకలకు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. పంట పొలాలకు, పశువుల మేపుకొనుటకు ఏరు దాటుకొని వెళ్ళాలి ఇక వేరే దారి లేదు కనుక మా ఊరి వారికి వేరేదారిలేదు ప్రజా ప్రతినిదులు, అదికారులు స్పందించి గాజులేరు కి పైపులను వేసి మాకు దారి మార్గం పరిష్కారం చూపాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply