ఛత్రపతి శివాజీ మహారాజ్ పోరాటం, త్యాగం మరువలేం..

వేల్పూర్, ఆంధ్రప్రభ : చత్రపతి శివాజీ మహారాజ్ పోరాటం త్యాగం మరుమలేమని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలో వేల్పూర్ బజరంగ్ దళ్ యూత్ యువజన సంఘం ఆధ్వర్యంలో బహుజన చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ మనువాదు గుండెల్లో శివసప్నం ఆయన శివాజీ మహారాజ్ పోరాటం త్యాగం మరువలేనిదని అన్నారు.రైతుల కోసం ఎన్నో సంస్కరణలు వేసినా మహిళలకు సమాన హక్కులు కల్పించిన మహా పురుషుడు యోధుడు రైతు రారాజు చత్రపతి శివాజీ అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అశోక్, ఉపసర్పంచ్ బాలయ్య, బిఆర్ఎస్ పార్టీ మండలం అధ్యక్షులు నాగధర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
