గురువు అంటే ఎవరు,
గురువు అంటే సర్వస్వం,
గురువు అంటే సాక్షాత్తు ప్రత్యక్ష దైవం,
గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరా!
గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మైశ్రీ గురవే నమ:
శిష్యులకు జ్ఞానబోధ చేయు క్రమంలో గురువులో ఒక మహా నటుడు కనబడతాడు,
గొప్ప వక్త కనబడతాడు, అత్భుతమైన ప్రేరణకర్త(A great inspiration) కనబడతాడు, మార్గనిర్దేశకుడు గోచరిస్తాడు. అలాగే భక్తుల ఆలోచనా రీతులను బట్టి సద్గురు సాయి కూర్చునే విధానాల్లో, నడిచే నడకలో, చేసే నృత్యాల్లో, పలికే పలుకుల్లో, చూపే మహిమల్లో, ఇచ్చే అనుభవాల్లో అనంతమైన విశ్వమే గోచరిస్తుంది. ఇది భక్తుల అనుభవేకవైద్యం. అనుభూతి చెందిన అక్షర సత్యం.
ఆ సాయినాధుడికి మనం భక్తులుగా మారామనుకోవడం ఒక భ్రమ. ఆయనే మనలను తన భక్తులుగా ఎన్నుకుంటారనేది సత్యం. అలాగే షిరిడి దర్శనం(a glimpse of Shirdi) కూడా మనం కోరుకున్నప్పుడు వెళ్లి చేసుకోవడం కన్నాఆ సాయినాథుని అభిష్టాన్ని బట్టి మనకు షిరిడి దర్శనం కలుగుతుందనేది వాస్తవం. ఇది ఎంతో మంది భక్తుల జీవితాల్లో అనుభవించిన సత్యం.
ఎప్పుడు ఎవరిని తన భక్తులుగా ఎన్నుకుంటారో, ఎవరిని షిరిడీకి రప్పించుకుంటారో అంతా బాబా వారి ఇష్టమే. నా అనుమతి లేనిదే ఎవరూ షిరిడీలో ప్రవేశించ లేరని తెలిపారు బాబా. ఎప్పటికైనా అదే జరుగుతుంది. ఇంద్రియ జ్ఞానానికి(for the senses) అతీతమైన సాయి లీలలను మనం అందుకోగలిగితే మన అలౌకిక ఆనందానికి అవధులే ఉండవు. విశ్వమంతా వ్యాపించి ఉన్న సాయినాథుడు మన మనసు అంతరాల్లో చేసే ఆలోచనలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంటాడు, గమనిస్తూనే ఉంటాడు.
అందుకే మన మంచి ఆటోచనలకు సత్ఫలితాలను, దురాలోచనలను, దుష్ఫలితాలను ప్రసాదించేదెవరు? ఆ సాయినాథుడు(Sai Nath) కాక. అసలు సాయినాథుడు ఏ రూపాన ఉన్నాడు? అన్ని రూపాలు ఆయనవే కాదా! అంతెందుకు మనలో ఉన్న రూపమూ ఆయనదే కదా! ఇట్టి సాయి లీలకు నిదర్శనంగా ఒక చిన్నదృష్టాంతమూ ఉన్నది.
ఒకానొక సమయంలో తాత్యా భార్య సాయినాథుని చెంతకు వచ్చి “బాబా! ఎప్పుడూ మేమే ఇక్కడికి వచ్చి మీకు భోజనం అందించాలా? మీరెన్నడూ మా ఇంటికి రారా?” అని ప్రశ్నించింది. సరేనని అంగీకరించారు బాబా. మరుసటి రోజు ఆ ఇల్లాలు పోలిగలు చేసి ఇంటిలో ఒక మూలకు పేడతో అలికి శుభ్రం చేసి బాబా చిత్రపటాన్ని ఉంచి ఆ ఫోటో ముందు తాను సిద్ధం చేసి ప్రసాదాన్ని ఉంచి ప్రార్థిస్తూ(praying) బాబా రాక కోసం ఎదురు చూస్తోంది.
కానీ ఎంత సేపైనా ఆయన రాలేదు. ఆ ప్రసాదం వాసనకు ఒక నల్ల కుక్క ఇంటి ముందుకు వచ్చి గడప వద్ద నిల్చొని ఇంటిలోకి తొంగి చూస్తూ ఆ ప్రసాదాన్ని తినడానికి ముందుకొచ్చింది. “అయ్యయ్యో బాబా ఇదేమి అపచారం” అనుకుంటూ ఆ ఇల్లాలు ఒక కర్ర(Karra)ను తీసుకుని నల్ల కుక్కను తరిమింది. ఆ రోజు బాబా వారు భోజనానికి రానేలేదు.
ఇక ఆ ఇల్లాలు మరోసారి బాబావారిని భోజనానికి పిలవడం, ప్రసాదాన్ని సిద్ధం చేసి ఆయన ఫోటో(Photo) ముందు పెట్టి బాబావారి కోసం ఎదురు చూడడం, ఆయన రాకపోగా ఒక డేగ రావడం ఆ ఇల్లాలు మళ్ళి కర్రతో తరమడం జరిగిపోయింది.
తదుపరి ఆ ఇల్లాలు భోజనానికి ఎందుకు రాలేదని అడగగా ఆయన మందహాసంతో “నేను ఒకసారి నల్లకుక్క రూపంలో, మరోసారి డేగ రూపంలోనూ నేను నీ ఇంటికి వచ్చాను భోజనం స్వీకరించడానికి. కానీ, నీవు నన్ను కర్రతో తరిమావు” అన్నారట. అంటే నేను ప్రతి జీవియందు ఉంటానని బాబావారు సెలవిచ్చారన్నమాట. సర్వంతర్యామియైన(All-pervading) సాయి లీలలను ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు.
శ్రీ సచ్చిదానంద స్వామివారికీ జై!!