రైతును వదలని తుఫాన్…

రైతును వదలని తుఫాన్…

ఆంధ్రప్రభ ప్రతినిధి, జనగామ : ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా విజృంభించిన మొంథా తుఫాన్ రైతుల జీవితాలను అతలాకుతలం చేసింది. ఇంకా ఆ ప్రభావం పూర్తిగా తగ్గకముందే, మరో తుఫాన్ రైతులపై విరుచుకుపడింది. మంగళవారం ఉదయం నుండి జనగామ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు వ్యవసాయ క్షేత్రాలను ముంచెత్తాయి. ఇప్పటికే తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలు కొంతమేర కోలుకుంటున్నాయనగా, అకాల వర్షాలు రైతుల ఆర్థిక పరిస్థితిని మరింత దెబ్బతీశాయి. ఆరు నెలల కష్టానికి ఫలితంగా వచ్చిన పంటను మార్కెట్‌కు తీసుకెళ్లే దశలో ఉండగా వర్షాలు మళ్లీ మోసం చేశాయి. పంట తడిసి ముద్దయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇంతటి నష్టాన్ని మేమెలా భరించగలమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply