దేశ ప్రజలను ఒక తాటిపైకి తెచ్చిన గీతం వందేమాతరం

దేశ ప్రజలను ఒక తాటిపైకి తెచ్చిన గీతం వందేమాతరం

బంజారాహిల్స్, ఆంధ్రప్రభ : బంజారాహిల్స్‌లోని ఐసీసీసీ ప్రాంగణంలో వందేమాతరం గేయాలాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్, ఐపీఎస్‌ ప్రధాన అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ (VC Sajjanar) మాట్లాడుతూ… వందేమాతరం సమర నినాదానికి 150 సంవత్సరాలు పూర్తయ్యాయని, స్వాతంత్ర్య ఉద్యమంలో ఈ గేయం కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశ ప్రజలను ఒక తాటిపైకి తెచ్చిందని తెలిపారు. ఈ గేయం స్వాతంత్ర్య సమరయోధుల్లో ఉత్సాహం నింపి, సాధారణ ప్రజలను కూడా పోరాటయోధులుగా మార్చిందన్నారు.

వందేమాతరం పాటలోని విలువలను, దాని వెనుక ఉన్న స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు చేరవేయడం మన బాధ్యత అని సజ్జనార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సీపీ (అడ్మిన్) పరిమళ హానా నూతన్, ఐపీఎస్‌, సీఏడీఓ శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply