మార్మోగిన గోదావరి తీరం..
దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలం గుడిరేవులో పద్మల్ పూరీకాకో(Padmal Poorikako) ఆలయంలో ఆదివాసీలు పద్మల్పూరీకాకో అమ్మావారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ రోజు కోకో ఆలయం వద్ద ఆదివాసీలు కుటుంబ సమేతంగా తరలివచ్చి కాకో అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా గిరిజన(Tribal) సంప్రదాయబద్ధంగా డోలు వాయిద్యాలతో గోదావరి తీరానికి చేరుకొని నదిలో పుణ్యస్నానం ఆచరించి గంగమ్మతల్లికి పూజలు చేశారు.
అనంతరం కాకో అమ్మావారి ఆలయం చుట్టు ప్రదక్షిణ చేసి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలను సమ ర్పించారు. గిరిజనులు కుటుంబసమేతంగా తరలివచ్చి కాకోను గిరిజన సంప్రదా యబద్ధంగా ప్రత్యేక పూజలు, పిండివంటలు, ప్రత్యేక భజనలు, గుస్సాడి(Gussadi) నృత్యాలతో గోదావరి తీరం మార్మోగింది.