winter | చలి పులి.. వెన్నులో వణుకు

winter | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తెలంగాణను చలి వణికిస్తోంది. రోజురోజుకూ చలితీవ్రత పెరుగుతోంది. సాయంత్రం 5 గంటల నుంచే చల్లని గాలులు వీస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళ ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతుండటంతో ఇళ్లలోని ప్రజలు వణికిపోతున్నారు. నగర పరిధిలో కన్నా శివారు ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా కనిపిస్తోంది. దీంతో ఆయా చోట్ల రాత్రి 8 గంటలకే రోడ్లపై రాకపోకలు తగ్గుతున్నాయి.

మహానగరం గజగజ..
చలికి హైదరాబాద్ సిటీ గజగజ వణుకుతోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. ఇవాళ ( శుక్రవారం) అత్యల్పంగా శేరిలింగంపల్లిలో 8.8 డిగ్రీలు నమోదైంది. రాజేంద్రనగర్‌లో 10.7, BHELలో 11.1, బొల్లారం, మారేడుపల్లి, గచ్చిబౌలిలో 11.7, కుత్బుల్లాపూర్‌లో 12.2, జీడిమెట్లలో 12.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే 3-4 రోజులూ ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది.
