మహిళల సేవలు అమోఘం..

మహిళల సేవలు అమోఘం..

ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : సమాజ సృష్టిలో ఆదిమంగా పరాశక్తిగా శ్రీమూర్తిని సృష్టించడం ఎంతో గర్వకారణమని పునీత పేతురు పౌలు దేవాలయ విచారణ గురువులు ఫాదర్ సిద్దెల జేసు ప్రసాద్ ఎస్జెసి, గబ్బెట అరుణ్ కుమార్ అన్నారు. తొలుత మహిళలను ప్రత్యేకించి సగౌరవంగా సత్కరించి, సన్మానించారు. కేక్ ను కట్ చేసి మహిళలకు పంచి పెట్టారు.

అనంతరం గురువులు జేసుప్రసాద్ అరుణ్ మాట్లాడుతూ.. మహిళలు నాలుగు పాత్రల్లో కీలకంగా వ్యవహరిస్తూ పురుషుడికి వెన్నుదన్నుగా నిలిచి తమ ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి, కుటుంబ కర్తవ్యాన్ని సంపూర్ణంగా నెరవేర్చడంలో మహిళలు ఎంతో చాకచక్యంగా వ్యవహరించడం శుభ పరిణామమన్నారు. ఆదిమ సృష్టిలో అమ్మ, అక్క, చెల్లి, భార్య, కూతురుగా మహిళా సృష్టి ప్రకృతిలో ఎంతో గొప్పదని కొనియాడారు. రక్తం పంచి, ప్రేగును తెంచి, ఓమాంసపు ముద్దను మనిషిగా మార్చి, ఎర్రని రక్తం తెల్లని పాలుగా మార్చి, నిన్ను పెంచి పోషించి పెద్దగా చేసిన తల్లి గొప్పదనం, ఆలనాపాలనతోను బిడ్డలను పెంచిన మాతృత్వానికే సాధ్యమన్నారు.

అది అమ్మ అనే అపురూపమైన పదానికే సొంతమని అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువేనని, శక్తి, కమ్మదనం అమ్మని మించిన దైవం లేదనేది వాస్తవం అన్నారు. అక్కా, చెల్లి అపురూపం, ఆత్మీయంతో, ప్రేమ, బంధం-భంధుత్వం, మధ్య రాకపోకలు, యోగక్షేమాలు, పలకరింపులు అనేక రకాలుగా కుటుంబ వ్యవస్థలో తోడబుట్టిన సోదరి, భార్యగా వ్యవహరిస్తుందన్నారు. భార్య ఎక్కడో జన్మించిన వ్యక్తిగా ఎంతటి బంధంతో, కేవలం మూడు ముళ్ళు, రెండు అక్షరాల పెళ్లి విధానాలతో నీలో సగమై, నీ అడుగు జాడల్లో, నీ మాటను దాటక నిన్నేదైవంగా భావించే భార్యగా వచ్చే ముందు తల్లిదండ్రులు, తన అక్కచెల్లెల్లు, అన్నదమ్ములు తప్పా వేరేలోకం తెలియని మహిళ సర్వం వదిలి, ఆశాపాశాలన్నీ వదిలి నిన్ను ప్రాణప్రదంగా నమ్మివచ్చేది భార్యేనని, తన సొంత అక్కాచెల్లి అన్నాతమ్ముడు కుటుంబం బంధుత్వాన్ని వదిలి అత్తింటి బంధంగా మీఇంటి వారిని దైవంగా భావించి, నావకు చుక్కానిలా చూసుకుంటూ జీవితాంతం రుణపడి ఉంటుంది.

కూతురు అనే బంధం జీవితంలో ఓ సరికొత్త లోకం. ఆడపిల్లల పై చిన్నచూపు, వారిని కనడమే ఒక నేరం, పెద్దభారం పెద్దసమస్య, బరువు భాద్యత అనుకునే ఆడపిల్లల ప్రేమలు, బంధాలు, బాధ్యతలు గొప్పదనం గురించి ఎంత చెప్పినా వినే పరిస్థితిలో ఎవరూలేరని, నేటి యుగంలో అంతరిక్షం వరకు సాహసోపేత సాహసం చేస్తున్నప్పటికీ, మహిళలు తలుచుకుంటే.. వంద సునామీలు, అణుబాంబు తుఫాన్ ప్రళయం చెలరేగినా మహిళల సాహసం ఎవరు ఆపలేరని ఆడపిల్లను బ్రతకనిద్దాం.. గౌరవిద్దామని.. పాదర్లు జేసుప్రసాద్, అరుణ్ పేర్కొన్నారు.

Leave a Reply