చిన్నపోర్లలో చెక్కులు పంపిణీ..

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; నారాయణపేటజిల్లాఊట్కూర్ మండల పరిధిలోని చిన్నపోర్లలో సర్పంచ్ గాండ్ల నిఖిత ప్రశాంత్ ఆధ్వర్యంలో శుక్రవారం లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు గ్రామంలో 15 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశామని అన్నారు.
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో గుర్తించిన వివిధ సమస్యలు దశలవారీగా పరిష్కరిస్తానని అన్నారు. మంత్రి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్,లబ్ధిదారులు డబ్బులు వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో 3వవార్డు సభ్యుడు గాజుల బందేనావజ్,
జీపీవో రేణుక, తదితరులు పాల్గొన్నారు.
