పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికుల పాత్ర గొప్పది

పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికుల పాత్ర గొప్పది

నమిలిగొండలో పారిశుధ్య కార్మికులకు ఘనంగా సన్మానం
సర్పంచ్ పురుమాని కోమల ఐలోని

స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ: గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికుల పాత్ర ఎంతో గొప్పదని నమిలిగొండ గ్రామ సర్పంచ్ పురుమాని కోమల ఐలోని అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగం గా స్టేషన్ ఘన్‌పూర్ మండలం నమిలిగొండ గ్రామంలో తెలంగాణ ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమా న్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పురుమాని కోమల ఐలోని ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులతో కలిసి పంచాయతీ సిబ్బం ది, పారిశుధ్య కార్మికులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులకు నిత్యావసర వస్తువులైన సబ్బులు, కొబ్బరి నూనె పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ..ప్రతి రోజు తెల్లవారు జా మునే గ్రామ వీధులను శుభ్రం చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు పారిశుధ్య కార్మికులు ఎంతో కష్టపడుతున్నారని కొనియాడారు. వారి శ్రమ వల్లే గ్రామం పరిశుభ్రంగా ఉండగలుగుతోందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా గ్రామాన్ని పరిశు భ్రంగా ఉంచేందుకు సహకరించాలని ఆయన కోరారు.

అలాగే ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామంలో అభివృద్ధి పనులను వేగ వంతం చేసి, రహదారులు, పారిశుధ్యం, తాగునీరు వంటి మౌలిక సదు పాయాలను మరింత మెరుగుపర్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తామని సర్పంచ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచా యతీ కార్యదర్శి పవన్ కుమార్, ఎంఎల్‌హెచ్‌పి డాక్టర్ రమ్యకృష్ణ, ఆశా వర్కర్లు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply