రోడ్లు బాగోలేదు.. స్కూళ్లు అంతంతే !!

  • సాగునీరు.. తాగునీరు కావాలి
  • నియోజకవర్గ అభివృద్ధికి సాయం చేయండి
  • పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ వినతి

ఆంధ్రప్రభ, పెదకూరపాడు (గుంటూరు జిల్లా) : పెదకూరపాడు నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు కేటాయించాలని సీఎం చంద్రబాబుకు పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ విజ్ఞప్తి చేశారు. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ కలసి వినతి పత్రాన్ని అందించారు.

నియోజకవర్గంలో రహదారులు, పాఠశాలలు, వైద్య సదుపాయాలు, రైతులకు సాగు నీరు, తాగునీరు సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.పెదకూరపాడు నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసేలా ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు.

Leave a Reply