Raja saab | డిసప్పాయింట్ చేస్తే మా ఇంటికి రండి.. అడ్రస్ ఇస్తా!

ఒక చిన్న సినిమా దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టి, నేడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను డైరెక్ట్ చేసే స్థాయికి చేరిన మారుతి.. తన మూడు ఏళ్ల కష్టాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ‘ది రాజా సాబ్’ ప్రీ-రిలీజ్ వేడుకలో స్టేజ్ పైనే దర్శకుడు మారుతి కన్నీళ్లు పెట్టుకున్నాడు.
మూడేళ్ల క్రితం ప్రభాస్ ‘ఆదిపురుష్’ షూటింగ్‌లో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేశారు. నేను ఆయన్ని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన రాముడి వేషంలో ఉన్నారు. ఆ రాముడి వద్దకే ఈ మారుతి వెళ్ళాడు. ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేయడమనేది నా కల. ఆయన నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం ఈ సినిమాను ప్రాణం పెట్టి తీశాను అని మారుతి తెలిపారు.
రీ-రికార్డింగ్ సమయంలో సినిమా సీన్లు చూస్తున్నప్పుడు తనకే తెలియకుండా కన్నీళ్లు వచ్చాయని మారుతి చెప్పుకొచ్చారు. “ఈ సినిమా నిజంగా నేనే తీశానా అని నాకే ఆశ్చర్యం కలిగింది. ప్రభాస్ ఈ సినిమా కోసం పడ్డ కష్టం, ఆయన నటన చూసి నేను బాగా ఏడ్చేశాను. సాధారణంగా ఎవరైనా చనిపోయినా నాకు కన్నీళ్లు రావు, కానీ ప్రభాస్ ప్రేమాభిమానాలు, ఈ సినిమా అవుట్‌పుట్ చూశాక కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అంటూ మారుతి వేదికపైనే వెక్కి వెక్కి ఏడ్చారు.
సినిమా ఫలితంపై మారుతి ఎంత నమ్మకంగా ఉన్నారంటే.. ఏకంగా తన ఇంటి అడ్రస్ ఇచ్చేంత ధైర్యం చేశారు డైరెక్టర్ మారుతి. ఈ సినిమా ఏ ఒక్కరినీ నిరాశపరచదు. ఒకవేళ సినిమా మీకు నచ్చకపోతే, నేరుగా మా ఇంటికి వచ్చి నన్ను ప్రశ్నించండి అంటూ స్టేజ్ పైనే తన ఇంటి అడ్రస్ చెప్పేశాడు మారుతి. ఇక మారుతి ఎమోషనల్ అవ్వడం చూసిన ప్రభాస్.. వెంటనే స్టేజ్ పైకి వచ్చి ఆయన్ని హత్తుకుని ఓదార్చారు.


