ది ప్యారడైస్ మూవీ యూనిట్ తాజాగా ఒక ఇంటెన్స్ షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసినట్టు తెలిపింది. ఈ సందర్భంగా మేకర్స్ షేర్ చేసిన బీటీఎస్ వీడియో ఫ్యాన్స్‌లో ఆసక్తిని రేపుతోంది.
మేకర్స్ విడుదల చేసిన బీహైండ్-ది-సీన్స్ వీడియోలో హీరో నాని రగ్డ్ లుక్‌లో, మసిల్ బాడీతో కనిపించగా, బ్యాక్‌డ్రాప్ మాత్రం యాక్షన్‌తో నిండిపోయింది. జైలు సెట్‌లో చిత్రీకరించిన ఈ సీన్‌లో ఇతర ఖైదీలు నానిపై దాడి చేయడానికి సిద్ధమవుతుండగా, నాని మాత్రం కూల్‌గా పుష్-అప్స్ చేస్తూ కనిపించడం హైలైట్‌గా మారింది.
డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల సీన్‌ను అత్యంత ప్యాషన్‌తో వివరిస్తూ, ఒక సందర్భంలో హీరో కాస్ట్యూమ్‌నే వేసుకుని యాక్షన్‌ను ప్రాక్టికల్‌గా చూపించారు. ఈ బీటీఎస్ వీడియో ఫ్యాన్స్‌లో భారీ ఎక్స్పెక్టేషన్స్‌ను క్రియేట్ చేస్తూ, ది ప్యారడైస్పై హైప్‌ను మరింత పెంచింది. ప్రస్తుతం ఈ చిన్న క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.