- హాస్టల్ తరలింపును అడ్డుకున్న ఓనర్
- అద్దె బకాయి చెల్లించాకే మార్చాలని పట్టు
భూపాలపల్లి జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : భూపాలపల్లి (Bhupalapalli) జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ శాఖ బాలుర వసతి గృహం భవనానికి అద్దె చెల్లించలేదని ఆ భవన యాజమాని రెడ్డి సురేష్ ప్రధాన గేటుకు తాళం (Gate lock) వేశారు. ఈ క్రమంలో వసతి గృహ తరలింపును కూడా ఆయన అడ్డుకున్నారు. గత 11 నెలల అద్దె బకాయిలు చెల్లించి వసతి గృహాన్ని మార్పు చేయాలని డిమాండ్ చేశాడు. దీంతో వసతి గృహంలో ఉన్న 34 మంది విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.
బకాయి అద్దె చెల్లించాలని భవన యజమాని వినతి
గత ఏడాది వరదలు కారణంగా వార్డెన్ సమ్మయ్య (Warden Sammayya) వినతి మేరకు, విద్యార్థుల ఇబ్బందులు దృష్ట్యా ఎలాంటి అగ్రిమెంట్ లేకుండా అద్దెకు భవనం ఇచ్చానని భవన యజమాని సురేష్ (building owner Suresh) తెలిపారు. సుమారు రూ. లక్ష వరకు కరెంట్ బిల్లు పెండింగ్ (Current bill pending) ఉందని, ప్రతి నెల అద్దె అడుగుతున్న సమయంలో ఏటీడబ్ల్యూఓ కి చెప్పామని అద్దె చెల్లిస్తామని వార్డెన్ దాటవేసే ధోరణి ప్రదర్శించారని తెలిపారు. ఇప్పటికే 11 నెలలు గడిచిందన్నారు. ఐటీడీఓ పీఓ, ఏటీడబ్ల్యూఓ తక్షణమే స్పందించి తమకు బకాయి ఉన్న 11 నెలల అద్దె, పెండింగ్ ఉన్న కరెంట్ బిల్ చెల్లించి సామాగ్రిని తీసుకువెళ్లాలని, అధికారులు తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయమై వార్డెన్ సమ్మయ్య ను వివరణ కోరగా అద్దె విషయం ఏటీ డబ్ల్యుఓ దృష్టిలో ఉందని వారు, యజమాని మాట్లాడుకున్నాకే వసతి గృహం ఇక్కడికి తరలించాలని తెలిపారు.